More
    Homeజిల్లాలుకామారెడ్డిPension Schemes | పింఛన్లు పెంచి ఇవ్వకుంటే సీఎంను అడుగడుగునా అడ్డుకుంటాం

    Pension Schemes | పింఛన్లు పెంచి ఇవ్వకుంటే సీఎంను అడుగడుగునా అడ్డుకుంటాం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pension Schemes | పింఛన్లు (Pensions) పెంచి ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్​ ఇన్​ఛార్జి మంథని సామ్యూల్​ అన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి మండల తహశీల్దార్​ కార్యాలయం (Tahsildar Office) ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.

    ఈ సందర్భంగా సామ్యూల్ (Manthani Samuel)​ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినప్పటికీ సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం పింఛన్లను పెంచలేదన్నారు. వెంటనే వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులు వితంతువులు చేయూత పింఛన్​దారులకు రూ.4 వేల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

    Pension Schemes | రేపు నాందేడ్​లో..

    రేపు నాందేడ్ జిల్లా దెగ్లూర్​కు సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ వస్తున్నారని.. సభను విజయవంత చేయాలని సామ్యూల్​ కోరారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి వికలాంగులు, వృద్ధులు, వితంతువులను గీత, నేత, బీడీ కార్మికులను కాంగ్రెస్​ దారుణంగా మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో వీహెచ్​పీఎస్​ నాయకులు సతీష్, సీనియర్ నాయకులు కంతి పద్మారావు, మండల అధ్యక్షుడు రామగల్ల శివానందం, పౌలయ్య, అంబయ్య, రాములు, చంటి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Gutta Jwala | 4 నెలల్లో 30లీట‌ర్ల త‌ల్లి పాల దానం.. అంద‌రి హృదయాలను గెలుచుకున్న గుత్తా జ్వాల..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Gutta Jwala | పెళ్లి తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది....

    CP Sai Chaitanya | పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతిఒక్కరూ పోలీసులు సూచించిన...

    MLA Bhupathi Reddy | సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్​లో చేరికలు

    అక్షరటుడే, డిచ్‌పల్లి : MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తున్న పథకాలకు...