అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో (RTC Bus stand) పనులన్నీ పూర్తిచేసి 15 రోజుల్లోనే ప్రారంబిస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు (Mla Madan Mohan Rao) పేర్కొన్నారు. గురువారం బస్టాండ్లో (Bus stand) జరుగుతున్న పనులను, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు.
ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. బస్టాండ్, ఆస్పత్రి నిర్మాణం కోసం ఆర్థిక మంత్రితో (Finance Minister Bhatti) మాట్లాడి రూ.4 కోట్లు విడుదల చేయించామని పేర్కొన్నారు. ఆయనతో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.