అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | మాజీ సీఎం కేసీఆర్పై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.
ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ విమర్శలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. తోలు తీస్తామని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)ను ప్రజలు చూశారన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తుందన్నారు.
Ponnam Prabhakar | కేసీఆర్ కపట ప్రేమ
పాలమూరు మీద కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాం అని కేసీఆర్ ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అందుకే కదా మొన్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. ‘‘మా తోలు తీయడం కాదు. కవితమ్మ తీస్తున్న తోలుకి ముందు పాచెస్ వేసుకోండి”అని చురకలు అంటించారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ సేమ్ ఇవే డైలాగులు కొట్టారని చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మాట్లాడుతూ.. రెండేళ్ల రేవంత్ పాలనలో బీఆర్ఎస్ కండలన్నీ కరిగి తోలు మాత్రమే మిగిలిందన్నారు. ఆ ఉన్న తోలును కాపాడుకోవడానికే కేసీఆర్ తోలు తీస్తానని మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని కేసీఆర్కు అర్థమైందన్నారు. అందుకే ఇన్ని రోజుల తర్వాత బయటికి వచ్చారని చెప్పారు. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న ప్రాజెక్ట్ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.