More
    HomeతెలంగాణCM Revanth Reddy | డ్రగ్స్ దందాలో ఎంత పెద్దోళ్లు ఉన్నా వదిలిపెట్టం : సీఎం...

    CM Revanth Reddy | డ్రగ్స్ దందాలో ఎంత పెద్దోళ్లు ఉన్నా వదిలిపెట్టం : సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం (Praja Palana Dinotsavam)లో ఆయన మాట్లాడారు.

    నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సందర్భంగా సెప్టెంబర్​ 17ను ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. మొదట సీఎం రేవంత్​రెడ్డి గన్​పార్క్​ (Gun Park)లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్​ గార్డెన్స్​లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం సెప్టెంబర్​ 17 అని ఆయన అన్నారు. బానిసత్వ సంకెళ్లను తెంచడానికి అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు.

    CM Revanth Reddy | డ్రగ్స్​కు గేట్​వేగా..

    హైదరాబాద్ (Hyderabad)​ నగరం డ్రగ్స్​కు గేట్​వేగా మారిందని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్​, గంజాయి నియంత్రణ కోసం ఈగల్ టీమ్​ (Eagle Team) ఏర్పాటు చేశామన్నారు. వీటి కట్టడి కోసం కఠినంగా వ్యవహిరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మత్తు పదార్థాలను అరికట్టడానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొందరికి నచ్చకపోవచ్చన్నారు. డ్రగ్స్, గంజాయి దందాలో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా కనికరించేది లేదన్నారు. ఫాంహౌస్‌లలో గంజాయి పండించి సరఫరా చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమకు అండగా ఉంటే మత్తు మాఫియాను లేకుండా చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

    CM Revanth Reddy | మూసీని సుందరంగా మారుస్తాం

    మూసీ నది (Musi River)ని శుద్ధి చేసి హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్​ను మారుస్తామన్నారు. నగరంలో నీటి సమస్య తలెత్తకుండా గోదావరి నీళ్లు తెస్తామన్నారు. మూసీ నదికి ఇరువైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తామన్నారు. డిసెంబర్​లో మూసీ ప్రక్షాళన ప్రారంభిస్తామని తెలిపారు.

    More like this

    Bodhan Sub-Collector | ఓటర్​ డాటా మ్యాపింగ్​పై శిక్షణ ఇవ్వాలి

    అక్షరటుడే, బోధన్​: Bodhan Sub-Collector | బీఎల్​వోలకు(BLO) ఓటర్ల డాటా మ్యాపింగ్​పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సబ్​ కలెక్టర్​...

    Telangana DGP | కొత్త డీజీపీ ఎవ‌రో? రెడ్డివైపే ప్ర‌భుత్వం మొగ్గు?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ప్ర‌స్తుత డీజీపీ...

    Group -1 Exams | గ్రూప్​–1 అంశంపై డివిజన్​ బెంచ్​లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group -1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై ఇటీవల హైకోర్టు (High Court) సింగిల్​...