అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీ పేలుడులో ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించామన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) రెండు రోజులు భూటాన్లో పర్యటించనున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి భూటాన్ బయలుదేరారు. ఆ దేశ ప్రధాని టోబ్గే ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ దేశ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్, ఆయన తండ్రి ,పూర్వీకుడు, నాల్గవ రాజు, అలాగే ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గుయ్లను కలుస్తారు. తన సందర్శన రెండు దేశాల స్నేహ బంధాలను మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉమ్మడి పురోగతి, శ్రేయస్సు వైపు మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు.
PM Modi | బరువెక్కిన హృదయంతో వచ్చా
భూటాన్ రాయల్ ప్రభుత్వం (Bhutan Royal Government) నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోదీ పాల్గొన్నారు. భూటాన్, దాని రాజకుటుంబం, ప్రపంచ శాంతిని విశ్వసించే వారందరికీ ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అని ఆయన అన్నారు. భారత్ (India), భూటాన్ లోతైన సాంస్కృతిక, భావోద్వేగ బంధాన్ని పంచుకుంటాయని చెప్పారు. కానీ తాను బరువెక్కిన హృదయంతో వచ్చానని తెలిపారు. ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన ప్రతి ఒక్కరినీ బాధపెట్టిందన్నారు. బాధితుల కుటుంబాల దుఃఖాన్ని తాను పంచుకుంటానని, మొత్తం దేశం వారితో ఉంటుందని తెలిపారు. దీని వెనుక ఉన్న వారిని వదిలిపెట్టం అని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.