HomeUncategorizedPak Army Chief | క‌శ్మీర్‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోము.. పాక్ ఆర్మీ చీఫ్ మ‌రోసారి ప్రేలాప‌న‌లు

Pak Army Chief | క‌శ్మీర్‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోము.. పాక్ ఆర్మీ చీఫ్ మ‌రోసారి ప్రేలాప‌న‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Pak Army Chief | భార‌త్ చేతిలో చావుదెబ్బ తిన్నాక కూడా పాకిస్తాన్‌కు బుద్ధి రాలేదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ (Pak Army Chief Asim Munir) మ‌రోసారి ప్రేలాప‌న‌ల‌కు దిగారు.

సింధు జ‌లాలు, కాశ్మీర్ అంశంపై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. సిందు జ‌లాల‌పై ఎటువంటి రాజీ లేద‌ని పేర్కొన్నారు. కాశ్మీర్‌(Kashmir)పై ఎటువంటి ఒప్పందాలు సాధ్యం కావ‌ని, దాన్ని తాము ఎప్ప‌టికీ మ‌ర్చిపోమని తెలిపారు. పాకిస్తాన్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల వీసీలు, అధ్యాప‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో అసీం మునీర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్‌కు సిందూ జ‌లాలే (Indus River) ప్రధాన ఆధార‌మ‌ని, 24 కోట్ల మంది దేశ వాసుల ప్రాథ‌మిక హ‌క్కు అయిన నీటిపై ఎటువంటి రాజీ ప‌డ‌బోమ‌ని తేల్చి చెప్పారు. సిందూ జ‌లాల కోసం అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పోరాడ‌తామ‌ని చెప్పారు.

Pak Army Chief | కాశ్మీర్‌ను మ‌ర్చిపోము..

గ‌తంలో కాశ్మీర్ పై మునీర్ వ్యాఖ్య‌లు చేసిన రోజుల వ్య‌వ‌ధిలోనే ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి(Terror Attack) జ‌రిగింది. కాశ్మీర్ జీవ‌నాడి అని ఆయ‌న చేసిన ప్ర‌సంగం త‌ర్వాతే ఉగ్ర‌వాదులు ఏప్రిల్ 22న మ‌త విధ్వంసానికి పాల్ప‌డ్డారు. దీంతో భార‌త్ ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు చేసింది. పాక్ ప్ర‌తీకారంతో దాడికి య‌త్నించ‌గా, ఇండియా(India) తిప్పికొట్ట‌డ‌మే కాకుండా ఆ దేశ మిలిట‌రీ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది.

అయినా బుద్ధి మార్చుకోని మునీర్ తాజాగా మ‌రోమారు కాశ్మీర్ అంశంపై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. కాశ్మీర్‌ను తాము ఎప్ప‌టికీ మ‌ర్చిపోమ‌ని చెప్పారు. క‌శ్మీర్‌పై ఎటువంటి ఒప్పందాలు సాధ్యం కావ‌న్నారు. పాకిస్తాన్(Pakistan) గాధ‌ను త‌ర్వాతి త‌రాల‌కు చేర‌వేయాల‌ని అధ్యాప‌కుల‌కు సూచించారు. మ‌రోవైపు, భార‌త్‌పైనా మునీర్ ప‌రోక్షంగా ఆరోప‌ణ‌లు సంధించారు. బ‌లూచ్ వేర్పాటు వాదం వెనుక విదేశీ శ‌క్తుల హ‌స్త‌ముంద‌ని ఆరోపించారు. స్థానిక ప్ర‌జ‌ల‌తో వేర్పాటువాదానికి సంబంధం లేద‌న్నారు.

Must Read
Related News