Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Congress | సమన్వయంతో ముందుకు సాగుతాం: ఏఐసీసీ పరిశీలకుడు రాజ్​పాల్​ కరోరా

Kamareddy Congress | సమన్వయంతో ముందుకు సాగుతాం: ఏఐసీసీ పరిశీలకుడు రాజ్​పాల్​ కరోరా

సమన్వయంతో ముందకెళ్తూ కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎంపిక నిర్వహిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు రాజ్​పాల్​ కరోరా పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | డీసీసీ అధ్యక్షుడి నియామకంలో అందరి సమన్వయంతోనే ముందుకు సాగుతామని ఏఐసీసీ పరిశీలకులు రాజ్​పాల్ కరోరా (AICC observer Rajpal Karora) తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకుల అభిప్రాయాలను సేకరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో పాత, కొత్త తేడా లేకుండా అందరిని కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడి (DCC president) నియామకంలో కార్యకర్తల అభిప్రాయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. వారి నిర్ణయం మేరకే అధ్యక్షుడి నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో ఏమైనా లోపాలుంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.

డీసీసీ అధ్యక్షుడి కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను పరిశీలనకు పంపిస్తామని పేర్కొన్నారు. అధ్యక్షుడి నియామకంలో రికమండేషన్లు ఉండవని స్పష్టం చేశారు. 55ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పరిశీలకుల పర్యటన తర్వాత నియామకాలు ఖరారు చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.

రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమ్మిళిత పాలన పట్ల కాంగ్రెస్ పార్టీ (Congress party) నిబద్ధతకు కట్టుబడి ఉందన్నారు. ఈ ఎన్నిక పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్ (Zaheerabad MP Suresh Shetkar), డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాజ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.