అక్షరటుడే, వెబ్‌డెస్క్:CM Revanth | రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్(CM Revanth) శనివారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారన్నారు. తమ పార్టీ, ప్రభుత్వం మహిళా శక్తిని ఎప్పుడు తక్కువ చేయలేదని పేర్కొన్నారు.
CM Revanth | మహిళా సంఘాలకు రుణాలు
మహిళలను కోటీశ్వరులు చేయడానికి మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు సీఎం(CM) తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలు పెట్టుకోవడానికి తాము ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల్లో సభ్యుల సంఖ్యను కోటిమందికి చేర్చాలని ఆయన సూచించారు. ఒక మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగు పడుతుందన్నారు. మహిళా సంఘాలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
CM Revanth | అనేక సంక్షేమ పథకాలు
మహిళల కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దీనికోసం ఆర్టీసీకి రూ.5,200 కోట్లు చెల్లించామని తెలిపారు. అంతేగాకుండా ఆర్టీసీలో మహిళా సంఘాల ద్వారా అద్దె బస్సులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల విద్యార్థుల యూనిఫాంల కుట్టే బాధ్యత కూడా మహిళా సంఘాలకే ఇచ్చామన్నారు.
CM Revanth | మహిళా సంఘాలకు రూ.వంద కోట్ల విలువైన భూమి
మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ(Hightech City)లో రూ.వంద కోట్ల విలువైన భూమిని మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అక్కడ 106 స్టాళ్లను పెట్టి మహిళలు తాము తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ స్టాళ్లను చూడడానికి మిస్ వరల్డ్ పోటీదారులు(Miss World Contestants) ఈ నెల 21 వస్తారని ఆయన వివరించారు.