అక్షరటుడే, ఇందూరు : Duddilla Giribabu | నగరంలోని 47వ డివిజన్ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేలా నిరంతరం కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి (BJP Candidate) దుద్దిళ్ల గిరిబాబు అన్నారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Duddilla Giribabu | బీజేపీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యం
ఈ సందర్భంగా దుద్దిళ్ల గిరిబాబు మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) ద్వారా పేదలకు ఇళ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ (Swachh Bharat Mission) ద్వారా పారిశుధ్య మెరుగుదల, అమృత్ పథకం ద్వారా తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
Duddilla Giribabu | 47వ డివిజన్లో..
47వ డివిజన్లో ప్రాథమిక సదుపాయాల మెరుగుదలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని గిరిబాబు అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా, యువ మోర్చా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.