ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తాం.. ఎవరు అడ్డం వస్తారో చూస్తా...

    CM Revanth Reddy | కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తాం.. ఎవరు అడ్డం వస్తారో చూస్తా : సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | ప్రొఫెసర్​ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఆయనను చట్ట సభకు పంపుతామని, ఎవరు అడ్డం వస్తారో చూస్తానన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలు కోదండరాం (Kodandaram), అమీర్​ అలీ ఖాన్ ఎన్నిక కాగా.. వారి నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ హయాంలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్​, కుర్రా సత్యనారాయణను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్​ వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అనంతరం కాంగ్రెస్​ అధికారంలోకి రాగా వారి స్థానంలో కోదండరాం, అమీర్​ అలీఖాన్​ను ఎమ్మెల్సీగా (MLC) ప్రతిపాదించింది. వీరి నియామకానికి గవర్నర్​ ఆమోదం (Governor Approval) తెలిపారు. అయితే ఈ విషయం శ్రవణ్​, సత్యనారాయణ కోర్టును ఆశ్రయించగా కోదండరాం, అలీఖాన్​ నియామకాన్ని రద్దు చేసింది. దీనిపై తాజాగా సీఎం స్పందిస్తూ ప్రొఫెసర్​ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తామని స్పష్టం చేశారు.

    CM Revanth Reddy | ఫాంహౌస్​లో మానవ మృగాలు

    హెచ్​సీయూలో క్రూర మృగాలు లేవని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మానవ రూపంలో ఉన్న మృగాలన్నీ ఫాంహౌస్‌లో ఉన్నాయని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయని ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌(Farm House)లలో ఉన్న మావన మృగాలను ముందు బంధించాలన్నారు. తన దగ్గర పంచడానికి డబ్బులు లేవన్నారు. చదువు ఒక్కటే ప్రజలను గుణవంతులను, శ్రీమంతులను చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్‌ఫర్డ్‌ స్థాయికి తీసుకెళ్తామన్నారు.

    CM Revanth Reddy | ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా

    ఓయూకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. తాను మళ్లీ ఓయూకు వస్తానని పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజ్(Arts College) ముందు మీటింగ్ పెడతానని చెప్పారు. ఆ రోజు ఒక్క పోలీస్‌ కూడా క్యాంపస్‌లో ఉండడని చెప్పారు. కాగా.. సోమవారం సీఎం పర్యటన సందర్భంగా యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్​ఎస్వీ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    Latest articles

    Kamareddy Collector | బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు ఫింగర్ ప్రింట్ సెట్స్ అందజేత

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్స్ మంత్ర ఫింగర్​ ప్రింట్...

    Mp Arvind | ఎంపీ బర్త్​డే సందర్భంగా ఆలయంలో పూజలు

    అక్షరటుడే, ఇందూరు: Mp Arvind | ఎంపీ ధర్మపురి అర్వింద్​ జన్మదినం సందర్భంగా జిల్లాలో బీజేపీ కార్యకర్తలు సంబురాలు...

    Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన విద్యార్థుల సస్పెన్షన్​

    అక్షరటుడే, ఇందూరు : Medical College | నిజామాబాద్​ మెడికల్​ కళాశాల (Nizamabad Medical College)లో జూనియర్​ను ర్యాగింగ్​...

    Vinayaka Chavithi | వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Vinayaka Chavithi | వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్...

    More like this