SP Rajesh Chandra
SP Rajesh Chandra | విడతల వారీగా కారుణ్య నియామకాలు జరుపుతాం

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు విడతల వారీగా కారుణ్య నియామకాలు చేపడతామని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వడ్ల రవి భార్య సౌఖ్య, అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ కుమార్తె మానసలకు సోమవారం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ డిపార్ట్​మెంట్​ (Police Department)కు మంచిపేరు తేవాలని సూచించారు. రెండు నెలల్లోపే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఎస్పీకి సౌఖ్య, మానసలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు విధుల్లో చేరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏవో ఎండీ అప్సర్, సూపరింటెండెంట్లు గంగాధర్, జమిల్ అలీ పాల్గొన్నారు.