అక్షరటుడే, భిక్కనూరు : Bhiknoor | భిక్కనూరును ఆదర్శ జీపీగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ పేర్కొన్నారు. సర్పంచ్‌గా విజయం సాధించిన అనంతరం శుక్రవారం ఆమె ఎన్నికల అధికారుల (Election Officer) నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
Bhiknoor | హోరాహోరీగా ఎన్నికలు..
భిక్కనూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) హోరాహోరీగా సాగాయి. భిక్కనూరు మేజర్ పంచాయతీ కావడంతో ఓట్ల లెక్కింపు కార్యక్రమం గురువారం అర్ధరాత్రి వరకు కొసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతుదారైన బల్యాల రేఖ సుదర్శన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె తన సమీప అభ్యర్థి సరితపై 1,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Bhiknoor | గతంలో ఎంపీపీగా సేవలు..
2006 నుంచి 2011 వరకు బల్యాల రేఖ భిక్కనూరు ఎంపీపీగా పనిచేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇంతపెద్ద మొత్తంలో మెజారిటీతో గెలవడం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొన్నారు.