HomeUncategorizedAmit Shah | ఆప‌రేష‌న్ సిందూర్‌తో స‌త్తా చాటాం : అమిత్ షా

Amit Shah | ఆప‌రేష‌న్ సిందూర్‌తో స‌త్తా చాటాం : అమిత్ షా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit Shah | ఆప‌రేష‌న్ సిందూర్‌ operation sindoorతో భారత్‌ త‌న స‌త్తాను చాటింద‌ని, శ‌త్రువులకు క‌చ్చితమైన సందేశం పంపింద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా home minister amit shah అన్నారు. జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్ర‌ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. న్యూఢిల్లీలోని New Delhi నార్త్ బ్లాక్‌లో కొత్త మల్టీ-ఏజెన్సీ సెంటర్ (MAC)ను షా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ.. దేశ వ్యూహాత్మక్మ వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలకు ‘ఆపరేషన్ సిందూర్​ ఓ ఉదాహరణ అని చెప్పారు. ఈ ఆపరేషన్ విజయవంతానికి ప్రధానమంత్రి మోదీ PM Modi దృఢ సంకల్పం, కచ్చితమైన, సకాలంలో అందిన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల సత్తా కారణాలని ప్రశంస‌లు గుప్పించారు.

Amit Shah | క్ష‌త‌గాత్రుల‌కు పరామర్శ..

దేశంలో నక్సల్స్‌ naxals నిర్మూలనకు చేపట్టిన మిషన్‌లో ‘ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్’ operation black forest సాధించిన విజయం చారిత్రకమని కేంద్రమంత్రి అమిత్‌షా అన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో 2026 మార్చికల్లా దేశంలో నక్సల్స్ నిర్మూలనకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ట్రౌమా సెంటర్‌లో చికిత్స పొందుతున్న ప‌లువురిని ప‌రామ‌ర్శించారు.

హోం మంత్రి అమిత్ షా ఇటీవల ముగిసిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్.. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో గాయపడిన ఐదుగురు భద్రతా సిబ్బందిని క‌లిసి ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న వైద్య చికిత్సల‌ను అడిగి తెలుసుకున్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కరెగుట్ట హిల్స్‌లో బలగాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టులపై జరిగిన ఈ అతిపెద్ద ఆపరేషన్‌ 21 రోజులపాటు సాగింది. పలువురు వాంటెడ్ కమాండర్స్‌తో సహా 31 మంది టాప్ నక్సలైట్లను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో గాయ‌ప‌డిన వారిలో అసిస్టెంట్ కమాండంట్ సాగర్ బొరాడే (204 కోబ్రా బెటాలియన్), హెడ్ కానిస్టేబుల్ మునీశ్ చంద్ శర్మ (203 కోబ్రా), కానిస్టేబుల్ ధను రామ్ (204 కోబ్రా), కానిస్టేబుల్ కృష్ణ కుమార్ గుర్జర్ (196 సీఆర్‌పీఎఫ్), కానిస్టేబుల్ సంతోశ్ మురమి (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఛత్తీస్‌గఢ్ పోలీస్) ఉన్నారు.