HomeUncategorizedMinister Jai Shankar | ఉగ్ర‌వాదులు పాక్‌లో ఎక్కడున్నా మ‌ట్టుబెడ‌తాం..విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

Minister Jai Shankar | ఉగ్ర‌వాదులు పాక్‌లో ఎక్కడున్నా మ‌ట్టుబెడ‌తాం..విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Minister Jai Shankar | ఉగ్ర‌వాదుల పాకిస్తాన్‌(Pakistan)లో ఏమూల‌న దాక్కున్నా వెంటాడి మ‌రీ మ‌ట్టుబెడ‌తామ‌ని విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) ముగియ‌లేదని, ప్ర‌స్తుతానికి కాల్పుల విర‌మ‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఉగ్ర‌వాదుల‌పై భార‌త పోరాటం ఆగ‌ద‌ని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ నుంచి పహల్గామ్ లాంటి ఉగ్ర ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌రిగితే ఇండియా(India) క‌చ్చితంగా స్పందిస్తుందన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కొత్త విధానాన్ని అనుస‌రిస్తుంద‌ని జైశంకర్ తెలిపారు. డ‌చ్ ప‌బ్లిక్ బ్రాడ్ కాస్ట‌ర్ ఎన్‌వోఎస్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ కొన‌సాగుతోంద‌ని, కాల్పుల విర‌మ‌ణ ఒప్పందంలో మూడో వ్యక్తి (అమెరికా) ప్ర‌మేయం లేద‌ని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌తో జ‌రిగే చ‌ర్చ‌ల్లో మూడో దేశం జోక్యం అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

Minister Jai Shankar | ప్ర‌తిస్పంద‌న వేరేగా ఉంటుంది..

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) త‌ర్వాత పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా దాడి చేసింద‌ని జైశంక‌ర్ తెలిపారు. పాక్ ప్ర‌తీకార దాడిని తిప్పికొట్టేందుకు చేప‌ట్టిన‌ ఆపరేషన్ సిందూర్ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. “ఆ ఆపరేషన్ కొనసాగుతోంది ఎందుకంటే ఆ ఆపరేషన్‌లో స్పష్టమైన సందేశం ఉంది. ఏప్రిల్ 22న మనం చూసిన రకమైన చర్యలు మ‌ళ్లీ పున‌రావృత‌మైతే ప్రతిస్పందన క‌చ్చితంగా ఉంటుంది. ఉగ్ర‌వాదులు(Terrorists) ఎక్క‌డ ఉన్నా మేము దాడి చేస్తామ‌ని” జైశంకర్ తెలిపారు. “ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉంటే, వారు ఉన్న చోటనే మేము దాడి చేస్తాం. కాబట్టి, ఆపరేషన్‌ను కొనసాగించడంలో ఒక సందేశం ఉంది, కానీ ఆపరేషన్‌ను కొనసాగించడం అంటే ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం లాంటిది కాదు” అని ఆయన వివ‌రించారు. ఆపరేషన్ నిద్రాణంగా ఉందా అని అడిగినప్పుడు, మీరు ఏ పదాన్ని అయినా చెప్పండి, కానీ సందేశం స్పష్టంగా ఉందని నేను మీకు చెప్పగలన‌ని బ‌దులిచ్చారు.

Minister Jai Shankar | ప‌హ‌ల్గామ్ మ‌త‌ప‌ర‌మైన దాడి

జమ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగింది మ‌త‌ప‌ర‌మైన దాడి అని జైశంక‌ర్(Minister Jai Shankar) అన్నారు. అక్కడ 26 మందిని “వారి మ‌తాన్ని నిర్ధారించుకున్న తర్వాత వారి కుటుంబాల ముందే హత్య చేశారని తెలిపారు. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అయిన పర్యాటకాన్ని దెబ్బతీయడం, మతపరమైన విభేదాలను సృష్టించడం ఈ దాడికి కార‌ణ‌మ‌ని వివ‌రించారు. దీని వెనుక పాకిస్తాన్ నాయ‌క‌త్వంతో పాటు పాక్ ఆర్మీ చీఫ్(Pak Army Chief) ఉన్నాడ‌ని తెలిపారు. పాక్ ఆర్మీచీఫ్ తీవ్ర మ‌తోన్మాది అని.. పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండు దేశాల సిద్ధాంతం గురించి చేసిన వ్యాఖ్యలను జైశంక‌ర్ గుర్తు చేశారు.

Must Read
Related News