అక్షరటుడే, ఇందూరు : BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే మరింత ఉధృతంగా ఉద్యమం కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Nara Sudhakar) అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో (Vinayak Nagar) గురువారం బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో అష్టాదశ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ధర్మ పోరాట దీక్ష నిర్వహించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు (BC Reservations) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు అగ్రవర్ణాల నాయకులు కేసులు వేసి రిజర్వేషన్లను నిలిపివేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దేవేందర్, రవీందర్, వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, అజయ్, చంద్రకాంత్, ఆర్టీసీ శ్రీనివాస్, నగేష్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.
