Homeజిల్లాలునిజామాబాద్​BC Reservations | బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: నరాల సుధాకర్​

BC Reservations | బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: నరాల సుధాకర్​

బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ పేర్కొన్నారు. హైదరాద్​లో నిర్వహించిన సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా బీసీ సంక్షేమ సంఘం (BC Sankshema Sangham) నాయకుడు నరాల సుధాకర్ అన్నారు. హైదరాబాద్​లోని (Hyderabad) కళింగ భవన్​లో ఆదివారం రాష్ట్ర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరాల సుధాకర్​ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించినట్లు తెలిపారు. బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు దేవేందర్, బాలన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.