అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Municipality | భీమ్గల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు అన్నారు.
పట్టణంలో (Bheemgal town) బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు (municipal elections) ఎప్పుడు వచ్చినా.. తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భీమ్గల్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు.
Bheemgal Municipality | తహశీల్దార్ కార్యాలయాన్ని తరలించాలి
ప్రజల సౌకర్యార్థం ప్రస్తుత తహశీల్దార్ కార్యాలయాన్ని (Tehsildar office) పట్టణంలోకి తరలించాలని మధు డిమాండ్ చేశారు. కార్యాలయం దూరంగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించే వరకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నవీన్, నాయకులు దయ ప్రవీణ్, ఉప్పాల నవీన్, అజయ్, హరిప్రసాద్, ఈశ్వర్, సాయి, దాడివి లక్ష్మీనారాయణ, గణ, నీలం గంగాధర్, బండి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.