అక్షరటుడే, ఇందూరు : Dinesh Kulachari | జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రూరల్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ.. లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని సూచించారు.
Dinesh Kulachari | మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కేవలం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రధాని మోదీకి (Prime Minister Modi) ప్రజలంతా మద్దతుగా ఉన్నారని, కావున బీజేపీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు పద్మారెడ్డి, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవి, గోపి, బిలోజి నాయక్, ఆనంద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.