అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెల్చుకుని కార్పొరేషన్‌పై (Municipal Corporation) కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నిజామాబాద్ నగర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన సందర్భంగా బొబ్బిలి వీధి (Bobbili Veedhi) అభివృద్ధి కమిటీ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Nizamabad Congress | ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ అండగా ఉంటుంది..
ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. నగర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అధినాయకత్వం నాపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, బండారి పెద్ద అబ్బయ్య, మురళి, భూపతి, చందు, గంగాధర్, విక్కీ, ప్రదీప్, పవన్, రాము, ప్రసాద్, రాజు, బండారి సాయన్న, మహేందర్ నాగరాజు, రాజేందర్, కృష్ణ, బొబ్బిలి వీధి వాసులు తదితరులు పాల్గొన్నారు.