అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | రామారెడ్డి మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని (Ramareddy town) ఎస్సీ కాలనీలో రూ.40 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు దెబ్బతినగా.. స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి.. సీఆర్‌ఆర్ నిధుల (CRR funds) ద్వారా రూ. 40లక్షలు మంజూరు చేశారు. అనంతరం శుక్రవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామారెడ్డి మండలంలోని (Ramareddy mandal) ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, గంగమ్మ వాగుపై వంతెన, రామారెడ్డి రామాలయ దేవస్థానం, కలభైరవ స్వామి ఆలయ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
