అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి (MLA Dr. Rekulapalli Bhupathi Reddy) అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన మహాధర్నాలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC reservations) కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడానికి ఇండియా కూటమి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మహా ధర్నాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం (Nizamabad Rural constituency) నుంచి బీసీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
BC Reservations | ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
అక్షరటుడే, ఎల్లారెడ్డి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహించిన దీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు ఎంతదాకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగం, పాలన.. అన్ని రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, వేలాదిమంది బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.