ePaper
More
    HomeతెలంగాణEx Mla Jeevan Reddy | కాంగ్రెస్​ అవినీతి బాగోతాలను బయటపెడతాం: మాజీ ఎమ్మెల్యే జీవన్​...

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ అవినీతి బాగోతాలను బయటపెడతాం: మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ అవినీతి బాగోతాలను వరుసగా బయటపెడతామని నిజామాబాద్​ బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్​లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​వీ ట్రిపుల్​ ఆర్​ స్కీములైతే.. రేవంత్​రెడ్డివి (CM revanth Reddy) ట్రిపుల్​ ఆర్​ స్కాములని అభివర్ణించారు. రేవంత్​రెడ్డి తన సోదరుడు రంజిత్​రెడ్డి, మరో వ్యక్తి ఫహీం ద్వారా రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నాడని.. రాహుల్​గాంధీకి మూటలు మోస్తున్నాడని ఆరోపించారు.

    Ex Mla Jeevan Reddy | తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్​

    తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ అయితే.. ఐటీ మంత్రిగా హైదరాబాద్​కు విశ్వ ఖ్యాతిని తెచ్చిన ఘనత కేటీఆర్​ది అని ఆయన స్పష్టం చేశారు. శనివారం కేటీఆర్‌ ఇంగ్లండ్​లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో (Oxford University) ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరం (Oxford India Forum) ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రాంటియర్‌ టెక్నాలజీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఇండియా (Frontier Technology for Development in India) సదస్సులో మాట్లాడబోతున్నారని వివరించారు.

    Ex Mla Jeevan Reddy | ఢిల్లీలో రేవంత్​రెడ్డి పడిగాపులు..

    రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దర్శనం కోసం ఢిల్లీలో పడిగాపులు గాస్తున్నారని జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు. కనీసం రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ కూడా చెప్పేందుకు వీలులేని రేవంత్​రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని దూషించడమేమిటన్నారు. ఏఐసీసీ (AICC) అంటే ఆలిండియా కరప్షన్ సెంటర్, పీసీసీ అంటే ప్రదేశ్ ‘కరప్షన్’ సెంటర్ అని మండిపడ్డారు. సీఎం అండతో దోచుకుంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్నారు. రూ.10వేల కోట్ల లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ రంజిత్ రెడ్డి దోపిడీకి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డిలు ఎందుకు ఈ అవినీతిపై నోరు మెదపడం లేదని నిలదీశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) స్పందించి సీబీఐ, ఐటీ, ఈడీ దర్యాప్తు చేయించాలని కోరారు. సమావేశంలో మన్నె గోవర్ధన్ రెడ్డి, కె.వాసుదేవ రెడ్డి, పల్లె రవికుమార్, రవి నాయక్ పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...