HomeతెలంగాణCM Revanth Reddy | భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.494 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గేట్‌వే ఆఫ్‌ ఇండస్ట్రీస్‌(Gateway of Industries)గా జహీరాబాద్‌ కావాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.

జహీరాబాద్‌(Zaheerabad) పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందన్నారు. 2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిమ్జ్‌ కోసం భూములు ఇచ్చినవారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పెంచాలని ఆదేశించారు. భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) మంజూరు చేస్తామన్నారు. మొత్తం 5,600 కుటుంబాలు భూములు కోల్పోయాయని, వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీకి(Indira Gandhi) విడదీయరాని అనుబంధం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీగా ఉన్న సమయంలోనే ఇందిరాగాంధీ మృతి చెందారని గుర్తు చేశారు. జహీరాబాద్​ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. త్వరలో నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు.

Must Read
Related News