అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | ఎల్లారెడ్డి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై రూ.3కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఎల్లారెడ్డి పెద్దచెరువును (Yellareddy Peddacheruvu ) ఆధునిక సదుపాయాలతో ముస్తాబు చేసేందుకు పార్క్, ఫుడ్ కోర్టులు, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా ఈ ప్రాంతం ప్రజల వినోదానికి, విశ్రాంతికి చక్కని అవకాశం దొరుకుతుందన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక పెద్దచెరువు ఎల్లారెడ్డి పట్టణానికి (Yellareddy town) ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా మారనుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.
అన్ని రంగాల్లో ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కుడుముల సత్యం, కురుమ సాయిబాబా, విద్యాసాగర్, గోపి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
