భీమ్గల్, అక్షరటుడే : Bheemgal Municipality | భీమ్గల్ పట్టణంలో తొమ్మిదో వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం వార్డు పరిధిలోని శివగల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Bheemgal Municipality | అనుభవజ్ఞుడైన నాయకుడిని ఎంచుకోవాలి
ప్రచారంలో మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. గతంలో మున్సిపల్ ఛైర్మన్గా (Municipal Chairman) రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. యువతకు ఉపాధి మార్గాలు, మహిళా సంఘాల బలోపేతం కోసం నిరంతరం శ్రమించానన్నారు. స్థానిక నాయకుడిగా ఇక్కడి ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఆపదలో ఉండి ఫోన్ చేస్తే వెంటనే స్పందించే గుణం తనకుందని తెలియజేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వారిని నమ్మవద్దని సూచించారు.
Bheemgal Municipality | సునీల్ కుమార్ సహకారంతో వార్డు అభివృద్ధి
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో నిధులు మంజూరు చేయించి, 9వ వార్డును నియోజకవర్గంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపర్చడం, వీధిదీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో శివ గల్లీ యువకులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.