అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ప్రారంభం అయ్యాయి. మూసీ పునరుజ్జీవంపై చర్చను స్పీకర్ ప్రారంభించారు.
ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఫస్ట్ ఫేజ్‌లో గండిపేట నుంచి బాపుఘాట్ వరకు 21 కి.మీ. మేర మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్ చేస్తామని తెలిపారు. మూసీ సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఏడీబీ బ్యాంక్రూ.4,100 కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు చెబుతామన్నారు. యూపీలో గంగా ప్రక్షాళన చేశారని, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారని సీఎం గుర్తు చేశారు. మూసీని కలుషితం చేయడంతో నల్గొండ జిల్లా (Nalgonda District) ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నుంచి 20 టీఎంసీలు ఈ నదిలోకి తరలిస్తామన్నారు. మార్చిలో మూసీ ఫస్ట్ ఫేజ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
CM Revanth Reddy | డీపీఆర్‌పై త్వరలో క్లారిటీ
బాపూఘాట్ దగ్గర మూసీ, ఈసా నదులు కలుస్తాయని ఆయన చెప్పారు. మూసీ అభివృద్ధికి అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించమన్నారు. మూసీ ప్రక్షాళన డీపీఆర్‌పై సంక్రాంతిలోగా క్లారిటీ వస్తుందని సీఎం తెలిపారు. కొందరు జలవనరులను ఆగం చేసి ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. మూసీ అభివృద్ధిపై అధ్యయనం కోసం అనేక దేశాల్లో పర్యటించినట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళన సమయంలో నష్టపోయే నిర్వాసితులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy | వరదలతో ప్రజల ఇబ్బంది
హైదరాబాద్ (Hyderabad)లో ఇటీవల వరదలు వచ్చినప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఒకేసారి తెరిచారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. దీంతో ఇళ్లు మునిగిపోయి, ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పైనుంచి వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్దిగా నీటిని కిందికి వదలాలని అన్నారు. కానీ కానీ అవేమీ పట్టించుకోకుండా ప్రాజెక్ట్ నిండే వరకు గేట్లు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో నాలాలు సరి చేయకుండా మూసీ సుందరీకరణ చేసినా ఉపయోగం ఉండదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. డ్రెయినేజీ నీళ్లు మూసీలో కలుస్తున్నప్పుడు, వాటిని అరికట్టకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తే లాభం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఎం స్పీచ్ అనంతరం తమకు మాట్లాడాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. దానికి స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో వారు వాకౌట్ చేశారు.