93
అక్షరటుడే, బోధన్ : Municipal Elections | రాబోయే బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకుడు రజాక్ తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడారు.
Municipal Elections | 38 వార్డుల్లోనూ పోటీ చేస్తాం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీలో (Bodhan Municipality) ఉన్న 38 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఎవరైనా తమ పార్టీ నుంచి పోటీ చేయదలుచుకున్న వారు తమను సంప్రదించాలని కోరారు. జాగృతి నుంచి పోటీ చేయదలచిన వారికి ఎన్నికల కమిషన్ (Election Commission) సింహం గుర్తు కేటాయించిందన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రవీణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.