అక్షరటుడే, ఇందూరు : Health Department | తమకు డబ్బులిస్తామంటేనే లెప్రసీ సర్వే చేస్తామని ఆశా కార్యకర్తలు అన్నారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయంలో (DMHO Office) ఏవోకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18వ తేదీ నుంచి సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు (ASHA Workers) సూచించిందన్నారు. కానీ అదనంగా ఇచ్చే రుసుముపై అధికారుల నుంచి స్పష్టత లేదన్నారు. దీంతో ఆశా వర్కర్లు నిరాశలో ఉన్నారన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కోవిధంగా అధికారులు ఆశా వర్కర్లను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.
Health Department | కనీస వేతనాలు కరువు..
ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు కనీసవేతనాలు అమలు కావట్లేదని నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాఖలో పని భారం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి చాలీచాలని పారితోషికాలతో వారు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలకు రూ. 18వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు (Leprosy Survey Money) సైతం చెల్లించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సుకన్య, రేణుక, గీత, అనిత తదితరులు పాల్గొన్నారు.