అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎస్ఎల్బీసీ పనులు పున: ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ఆయన సోమవారం పరిశీలించారు.
హెలీమాగ్నెటిక్ సర్వేకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి అధికారులు వివరించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా ఈ రోజు నుంచి మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే చేపడుతున్నారు. ఈ హైటెక్ సర్వే పద్ధతితో భూమి లోపల ఉండే షీర్జోన్లు, నీటి ప్రవాహాలను గుర్తించనున్నట్లు అధికారులు వివరించారు.
CM Revanth Reddy | కేసీఆర్ నిర్లక్ష్యం
ఎస్ఎల్బీసీ–1, ఎస్ఎల్బీసీ–2 పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరు చేశారని సీఎం తెలిపారు. దీని కోసం టన్నెల్ బోరు మిషన్‌ను అమెరికా నుంచి తెప్పించారన్నారు. నల్లమల అడవులు, వన్య ప్రాణులకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టారన్నారు. తెలంగాణ (Telangana) వచ్చే నాటికి 30 కిలో మీటర్ల సొరంగ నిర్మాణం పూర్తయిందన్నారు. పది కిలోమీటర్ల మేర పనులు మిగిలి ఉండగా.. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రెండు, మూడు కిలోమీటర్లు పనులు చేపట్టి గాలికి వదిలేసిందన్నారు.
కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి పది కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కమీషన్లు రావడం లేదని కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao) ప్రాజెక్ట్‌ను పక్కన పడేశారన్నారు.
CM Revanth Reddy | గ్రావిటీ ద్వారా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ పనులు మళ్లీ చేపట్టామన్నారు. అయితే ప్రమాదవశాత్తు సొరంగం కూలిపోయి కార్మికులు చనిపోయారన్నారు. దీంతో ప్రస్తుతం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పనులు పున: ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్‌గా ఎస్ఎల్బీసీ (SLBC Tunnel) నిలుస్తుందన్నారు. ఈ సొరంగం పూర్తయితే.. ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నల్గొండకు నీటిని తరలించవచ్చన్నారు. మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు.
కేసీఆర్ (KCR) హయాంలో కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బీఆర్ఎస్ హయాంలో రూ.1.86 లక్షల కోట్లు చెల్లించారన్నారు. అందులో కాళేశ్వరం కాంట్రాక్టర్లకు రూ.1.03 లక్షల కోట్లు ఇచ్చారని వెల్లడించారు. ఇంత ఖర్చు చేసినా.. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదన్నారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ పనులను రూ.4,600 కోట్ల లోపే పూర్తి చేయాలని చూస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
1 comment
[…] సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జర్మనీకి చెందిన ప్రతినిధి […]
Comments are closed.