అక్షరటుడే, బోధన్: MIM Bodhan| బోధన్ మున్సిపల్ ఛైర్మన్ (Bodhan Municipal Chairman) పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఎంఐఎం(MIM Party) జిల్లా అధ్యక్షుడు ఫయాజోద్దీన్ అన్నారు. బోధన్‌లో జరిగిన పట్టణ కమిటీ సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 20 కంటే ఎక్కువ సీట్లు గెలిచి, ఎవరి మద్దతు లేకుండా ఛైర్మన్ సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పట్టణాధ్యక్షుడు ఇలియాస్‌తో పాటు కమిటీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మాజీ మేయర్ మీర్ మజాజ్ అలీ, నాయకులు షమీ, ఖదీర్, వాజీద్, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
