ePaper
More
    Homeఅంతర్జాతీయంCrude Oil Imports | రష్యా నుంచి ఆయిల్​ కొంటాం.. స్పష్టం చేసిన ఆయిల్​ కంపెనీలు

    Crude Oil Imports | రష్యా నుంచి ఆయిల్​ కొంటాం.. స్పష్టం చేసిన ఆయిల్​ కంపెనీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Imports | రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు చేస్తూనే ఉంటామని భారత కంపెనీలు ప్రకటించాయి. రష్యా నుంచి భారత కంపెనీలు (Indian Companies) ఆయిలు కొనుగోలు చేయడం ఆపేశాయని ట్రంప్​ శనివారం వ్యాఖ్యలు చేశారు.

    ఇండియన్​ ఆయిల్​, హిందుస్థాన్​, భారత్​ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీలు (Mangalore Refineries) రష్యా నుంచి ఆయిలు దిగుమతులను నిలిపివేశాయని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్ (Trump)​ అది మంచి నిర్ణయం అన్నారు. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. రష్యా నుంచి ఆయిల్​ దిగుమతులు కొనసాగుతాయని స్పష్టం చేశాయి.

    Crude Oil Imports | దేశ ప్రయోజనాలే ముఖ్యం

    దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని తేల్చి చెప్పాయి. రష్యా (Russia) నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం విషయంలో భారత్​ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. ఉక్రెయిన్​తో యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అగ్రరాజ్యం అమెరికా భావించింది. ఇందులో భాగంగా నాటో దేశాలు రష్యా నుంచి ఆయిల్​ దిగుమతి చేసుకోకుడదని చెప్పింది. అంతేగాకుండా అమెరికా మిత్ర దేశాలు కూడా రష్యా నుంచి ముడి చమురు (Crude Oil) దిగుమతి చేసుకోకుండా ఒత్తిడి తెచ్చింది.

    READ ALSO  US President Trump | వారు ఏం చేసుకున్నా సంబంధం లేదు.. భార‌త్‌, ర‌ష్యా సంబంధాల‌పై ట్రంప్ వ్యాఖ్య‌

    Crude Oil Imports | తలొగ్గని భారత్​

    రష్యా నుంచి చాలా దేశాలు ఆయిల్​ దిగుమతి చేసుకోవడం ఆపేశాయి. దీంతో ఆ దేశం భారత్​, చైనాలకు బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేస్తామని ముందుకు వచ్చింది. దీంతో భారత్ (India) రష్యా నుంచి ఆయిల్​ దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో అమెరికా, నాటో దేశాలు పలుమార్లు ఆయిల్​ దిగుమతి చేసుకోవడం ఆపాలని భారతకు సూచించాయి. అయితే భారత్ మాత్రం ఆ దేశాల మాటలకు తలొగ్గకుండా ముడి చమురు దిగుమతి కొనసాగిస్తుంది. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుగోలు చేసే హక్కు తమకు ఉందని భారత్​ స్పష్టం చేసింది.

    Crude Oil Imports | సుంకాలతో భయపెట్టినా..

    రష్యా నుంచి ఆయిల్​ దిగుమతులు ఆపకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ భారత్​పై భారీ సుంకాలు (Huge Tariffs) విధించాడు. ఇండియా నుంచి వచ్చే ఉత్పత్తులపై 25శాతం టారిఫ్స్​ విధిస్తున్నట్లు ప్రకటించాడు. రష్యా నుంచి ఆయిల్​, ఆయుధాలు కొనుగోలు చేస్తుండడంతో అమెరికా సుంకాలు విధించింది. అయినా భారత్​ మాత్రం ఆయిల్​ కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. అమెరికాతో సుంకాల విషయం చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    READ ALSO  Earthquake | రష్యాలో అతి భారీ భూకంపం.. రిక్టర్​ స్కేల్​పై 8.7 తీవ్రత నమోదు.. మూడు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ..

    Latest articles

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర...

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    More like this

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర...

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...