అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponnam Prabhakar | హుస్నాబాద్‌లో ఉప్పల్ స్టేడియం లాంటి క్రికెట్ స్టేడియం (Cricket Stadium) నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాకా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరీంనగర్ (Karimnagar)లోని అలుగునురు వద్ద గల వెలిచాల జగపతి రావు మెమోరియల్ గ్రౌండ్లో కాకా (వెంకట్‌స్వామి) టోర్నమెంట్ సాగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టీ20 టోర్నీలో పలు జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కాకా టోర్నమెంట్ (Kaka Tournament) నిర్వహించడంపై అభినందించారు. ఈ టోర్నీ ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పారు.
Ponnam Prabhakar | ఎందరో క్రీడాకారులు
మన రాష్ట్రం నుంచి గతంలో హర్షద్ అయూబ్, శివలాల్ ,అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి క్రికెట్ ఆటగాళ్లు తెలంగాణ ఖ్యాతిని చాటారని చెప్పారు. ప్రస్తుతం మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. హుస్నాబాద్‌లో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలన్నారు. హెచ్‌సీఏ, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో స్టేడియం నిర్మిస్తామని మంత్రి వివేక్ వెంకట్‌స్వామి (Minister Vivek Venkatswamy) తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు తదితరులు పాల్గొన్నారు.