అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులను ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోలేదని, రైతులంటే సీఎంకు, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి (YellaReddy constituency) వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) రైతులను పరామర్శించకుండా విహారయాత్రకి వచ్చి వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగిందన్నారు. ప్రత్యేక నిధులతో ప్యాకేజీ ఇస్తారనుకుంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రెండు, మూడురోజుల్లో ప్యాకేజీ ప్రకటించకపోతే నియోజకవర్గ రైతులతో కలిసి బీసీ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.
పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయాలని, వరదలో బోరు మోటార్లు కొట్టుకుపోయిన రైతులకు కొత్త మోటార్లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ముదాం సాయిలు, కపిల్ రెడ్డి, ఏగుల నర్సింలు, సతీష్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, పృథ్విరాజ్, గంగారెడ్డి, మనోజ్, బర్కత్, దయాకర్, తదితరులు పాల్గొన్నారు.