Homeజిల్లాలుఖమ్మంKavitha Janam Bata | 19న సింగరేణి ఆఫీస్​ ముట్టడిస్తాం : కల్వకుంట్ల కవిత​

Kavitha Janam Bata | 19న సింగరేణి ఆఫీస్​ ముట్టడిస్తాం : కల్వకుంట్ల కవిత​

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాటలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. సత్తుపల్లిలోని జేవీఆర్​ ఓపెన్​ కాస్ట్​ గనిని ఆమె సందర్శించి సింగరేణి కార్మికులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాటలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలో (Khammam District) పర్యటించారు. మధిర లెదర్ పార్క్ ప్రతిపాదిత స్థలాన్ని ఆమె పరిశీలించారు. లెదర్ పార్క్ ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై స్థానికులతో మాట్లాడారు.

టేకులపల్లి మోడల్ స్కూల్​ను (Tekulapally Model School) సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సత్తుపల్లిలోని జేవీఆర్​ ఓపెన్​ కాస్ట్​ గనిని కవిత సందర్శించారు. కార్మికులతో మాట్లాడారు. సింగరేణిలో (Singareni) డిపెండెంట్​ ఉద్యోగాలు ఉండాల్సిందే అని ఆమె డిమాండ్​ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపెండెంట్​ ఉద్యోగాల కోసం ఈ నెల 19న హైదరాబాద్​లోని (Hyderabad) సింగరేణి ఆఫీస్​ను ముట్టడిస్తామన్నారు. హెచ్​ఎంఎస్​, జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Kavitha Janam Bata | సమస్యల పరిష్కారం కోసం..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఆధ్యర్యంలో పోరాటాలు చేస్తున్నట్లు కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ఆమె మాట్లాడారు. జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని.. వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిని ఎవరూ రక్షించలేరన్నారు. కాగా.. ఇటీవల ఆమె హరీశ్​రావుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కవిత విమర్శలపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులు స్పందించారు. దీంతో ఆమె వారిని ఎవరు రక్షించలేరని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యంతోనే జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ గెలిచిందని మరోసారి అన్నారు.

Must Read
Related News