HomeUncategorizedNara Lokesh | మహిళలను అవమానించే వాళ్లను బండకేసి కొడతాం : నారా లోకేష్​

Nara Lokesh | మహిళలను అవమానించే వాళ్లను బండకేసి కొడతాం : నారా లోకేష్​

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: Nara Lokesh : మహిళలను అవమానించే వాళ్లను బండకేసి కొట్టి, లోపల వేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. మహిళలపై వైకాపా(YSRCP) నేత సజ్జల చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేశ్ ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలు నిరసన తెలిపితే అవమానిస్తారా? అని మండిపడ్డారు.

“వైకాపా(YSRCP) నాయకుల ఆ భాష ఏంటి.. వారి ప్రవర్తన ఏంటి? మహిళలు నిరసన తెలిపితే.. వైకాపా నేతలకు తప్పుగా అనిపిస్తోందా? మహిళలను వైకాపా నేతలు కించపర్చేలా మాట్లాడుతున్నారు. కనిపెంచిన తల్లి, తోడబుట్టిన చెల్లిని తరిమేసిన జగన్​ను వైకాపా నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. మహిళలంటే వైకాపా నేతలకు ఎందుకంత చిన్నచూపు? మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం”అని లోకేష్​ హెచ్చరించారు.

“ఆల్రెడీ ఒకరి పని అయిపోయింది.. రెండో వ్యక్తి కోసం వెతుకుతున్నాం.. వాళ్లను బొక్కలో వేయడానికి రెండు నిమిషాల పని.. జరుగుతున్న వాటిని కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. గతంలో శాసనసభ(Legislative Assembly) సాక్షిగా నా తల్లిని అవమానించారు..” అని లోకేష్​ పేర్కొన్నారు. అదే భారతి రెడ్డి(BHARATHI REDDY) గురించి టీడీపీ(TDP) కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే అతడిపై చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.

Must Read
Related News