HomeUncategorizedPakistan Army Chief | అణ్వాయుధాల‌తో దాడి చేస్తాం.. స‌గం ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తామ‌ని పాక్...

Pakistan Army Chief | అణ్వాయుధాల‌తో దాడి చేస్తాం.. స‌గం ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తామ‌ని పాక్ ఆర్మీ చీఫ్ ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Army Chief | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Army Chief Asim Munir) క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. అమెరికా గ‌డ్డ మీద నుంచి మ‌రోసారి భార‌త్‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేశారు. త‌మది అణ్వాయుధ దేశ‌మ‌ని, త‌మ‌కు ముప్పు ఏర్ప‌డిన‌ప్పుడు అణ్వాయుధాలు ప్ర‌యోగిస్తామ‌ని హెచ్చ‌రించారు. తాము నాశ‌న‌మ‌వుతుంటే త‌మ‌తో పాటు స‌గం ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తామ‌ని పేర్కొన్నారు.

సిందూ న‌ది (Indus River) ఏ ఒక్క‌రి సొత్త కాద‌ని, న‌దిపై ఆన‌క‌ట్ట క‌డితే క్షిప‌ణుల‌తో పేల్చి వేస్తామ‌ని హెచ్చ‌రించారు. భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) చేప‌ట్టిన త‌ర్వాత అసిమ్ మునీర్ మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే అమెరికాలో రెండోసారి ప‌ర్య‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. టంపాలో పాకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా పనిచేస్తున్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ కోసం ఏర్పాటు చేసిన బ్లాక్-టై విందు సందర్భంగా మాట్లాడిన అత‌డు.. అమెరికా గ‌డ్డ మీద నుంచి పిచ్చి ప్రేలాప‌న‌లు చేశారు. “మనం ఒక అణ్వస్త్ర దేశం (nuclear-armed country), మనం పతనమవుతున్నామని అనుకుంటే, మనతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాము” అని వ్యాఖ్యానించారు. అమెరికా గ‌డ్డ నుంచి ఒక దేశం మ‌రో దేశాన్ని రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించ‌డం ఇదే తొలిసారి.

Pakistan Army Chief | సిందూన‌ది భార‌త సొత్తు కాదు..

సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) ఇండియా నిలిపి వేయడంపై స్పందించిన మునీర్ పిచ్చి వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ నిర్ణ‌యం 250 మిలియన్ల మంది ప్రజలను ఆకలితో అణిచివేస్తుందని హెచ్చరించారు. “భారతదేశం ఆనకట్ట నిర్మించే వరకు మేము వేచి ఉంటాము. ఆన‌క‌ట్ట‌ క‌ట్టిన త‌ర్వాత మేము క్షిప‌ణుల‌తో దాన్ని పేల్చేస్తాం. మా వ‌ద్ద క్షిపుణుల‌కేం కొదువ లేదు. 10 క్షిపణులు సే ఫారిగ్ కర్ డెంగే (మేము దానిని 10 క్షిపణులతో నాశనం చేస్తాము),” అని ఆయన అన్నారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. “హుమేన్ మిస్సిలోన్ కి కామి నహిన్ హై (మనకు క్షిపణుల కొరత లేదు” అని మునీర్ నేరుగానే హెచ్చ‌రించారు.

Pakistan Army Chief | మెర్సిడెస్ బెంజ్‌- డంప్ ట్ర‌క్కు..

మునీర్ భారతదేశాన్ని మెర్సిడెస్‌తో, పాకిస్తాన్‌తో (Pakistan) డంప్ ట్రక్కుతో పోల్చుతూ పిచ్చి ప్రేలాప‌న‌లు చేశారు. భార‌త్ త‌ళ‌త‌ళ మెరిసే మెర్సిడెస్ బెంజ్ వంటి కారు అయితే, పాకిస్తాన్ రాళ్లు, ఇసుక నింపిన డొక్కు ట్ర‌క్కు అని.. ఇవి రెండు ఢీకొంటే ఎవ‌రికో న‌ష్టమో ఊహించుకోవ‌చ్చ‌ని చెప్పారు.

Must Read
Related News