అక్షరటుడే, కామారెడ్డి : BC Reservations | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధిస్తామని బీసీ రిజర్వేషన్ (BC reservation) సాధన సమితి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో (Satya Convention Hall) శనివారం బీసీ ఆక్రోశ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. 2023 నవంబర్ నెలలో కామారెడ్డిలో (Kamareddy) బీసీ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. 42 శాతం రిజర్వేషన్ బీసీ కమిషన్ (BC Commission) ద్వారా జనగణన, కులగణన (caste census) చేపట్టి అమలు చేస్తామని చెప్పారన్నారు. అలాగే ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు బీసీల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. బూటకపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం చేయకుండా తప్పుల తడకగా కులగణన చేశారని విమర్శించారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ ఎలా అమలవుతుందో అదే తరహాలో ఇక్కడ కూడా ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
BC Reservations | ఫామ్‌హౌస్ దాటని కేసీఆర్
కేసీఆర్ (KCR) దొరవారేమో ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్‌పై నోరు మెదపడం లేదన్నారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్‌ను బీఆర్ఎస్ హయాంలో 23 శాతానికి తగ్గించారన్నారు. కేంద్రంలోని బీజేపీ (BJP) బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీలపై బీజేపీ వివక్ష చూపుతుందన్నారు. ముస్లిం రిజర్వేషన్‌ను బూచిగా చూపి బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఛైర్మన్ విశారదన్ మహరాజ్, రిజర్వేషన్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు గౌడ్, మాజీ కలెక్టర్ చిరంజీవులు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
1 comment
[…] రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు (BC Reservations) ఏం ఇస్తుందని ఎంపీ అర్వింద్ ఎద్దేవా […]
Comments are closed.