అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Caste census | కేంద్రప్రభుత్వం చేపట్టే జనగణనతో పాటు కులగణనను (caste census) స్వాగతిస్తున్నామని మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు బాజిరెడ్డి జగన్ (Munnur Kapu Sangam district leaders Bajireddy Jagan), కొండ దేవయ్య అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో మున్నూరు కాపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని.. అన్ని గ్రామాల్లో ఉన్న సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘ సభ్యుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు గాండ్ల లింగం, దేవేందర్, రాజేశ్వర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
