VHP Nizamabad | పహల్​గామ్​లో కాల్పులకు తెగబడ్డ వారి భరతంపట్టాలి
VHP Nizamabad | పహల్​గామ్​లో కాల్పులకు తెగబడ్డ వారి భరతంపట్టాలి

అక్షరటుడే, ఇందూరు:VHP Nizamabad | జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​లో ఉగ్రదాడి(Terror Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీహెచ్​పీ జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేశ్(VHP District Joint Secretary Datrika Ramesh)​ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తాలో ఉగ్రవాదుల(Terrorist) దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో సర్జికల్​ స్ట్రైక్​(Surgical Strike) చేసి ఉగ్రవాదుల పనిపట్టాలన్నారు.

కార్యక్రమంలో వీహెచ్​పీ జిల్లా కార్యదర్శి దయానంద్, ఉపాధ్యక్షుడు ఆనంద్, కోశాధికారి శేఖర్, సంపర్క్ ప్రముఖ్ శేఖర్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్, బజరంగ్​దళ్​ జిల్లా సహా సంయోజక మహేష్, నగర సహ సంయోజన్ సురేష్, సాయికిరణ్, తరుణ్, కార్తీక్ రాజ్​పుత్​ తదితరులు పాల్గొన్నారు.