10
అక్షరటుడే, బోధన్: Bodhan | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని బోధన్ సీఐ వెంకట్ నారాయణ (Bodhan CI Venkat Narayana) పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగింది. అనంతరం సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు(Drugs) వాడడం కారణంగా కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.