అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి (Atal Bihari Vajpayee) అపర మేధావి అని.. నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా బీజేపీ (BJP) ప్రకటించిందని గుర్తు చేశారు. దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. అణు పరీక్షల ఒప్పందం ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి దేశానికి గౌరవాన్ని నిలబెట్టారన్నారు. వాజ్పేయి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్రవంతి రెడ్డి (Sravanthi Reddy), జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.