అక్షరటుడే, ఇందూరు: Lions club | డ్రగ్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Anti Narcotics Bureau) డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Sandilya) అన్నారు. నిజామాబాద్‌కు చెందిన లయన్స్ క్లబ్ ప్రతినిధి ప్రసాద్ డ్రగ్స్ కారణంగా జరిగే దుష్ఫరిణామాలపై షార్ట్ ఫిలిం (Short film) రూపొందించి ప్రదర్శించడంతో మంగళవారం హైదరాబాద్‌లో ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత యూట్యూబ్‌ను ఎక్కువగా అనుసరిస్తున్నారని, ఇలాంటి షార్ట్ ఫిల్మ్‌ల వల్ల డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కలిగే అవకాశం ఉందన్నారు.
అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ (Anti-Drug Awareness) డిస్ట్రిక్ట్ ఛైర్మన్ విజయానంద్‌ను అభినందించారు. కార్యక్రమంలో నార్కోటిక్స్ బ్యూరో (Narcotics Bureau) ఎస్పీ సీతారాం, ఏఎస్పీ కృష్ణమూర్తి, సీఐ శ్రీనివాసరావు, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.