అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రగ్స్‌కు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని బాల్కొండ సీఐ శ్రీధర్ (CI Sridhar) పేర్కొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందించిన ‘Say No to Drugs. Say Yes to Sports’ షార్ట్‌ఫిల్మ్‌ను (Short film) ఆయన తన కార్యాలయంలో శనివారం విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు అలవాటు పడి ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. వాటి మాయలో పడి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. వీటికి బదులుగా క్రీడలపై మనసు పెట్టి ఆడితే మత్తు పదార్థాలకు దూరంగా ఉండవచ్చన్నారు.
క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడకు చెందిన కచ్చకాయల శ్రీనివాస్ శ్రవణ్ దర్శకత్వం వహించగా.. రాజు, బాలు, సంజయ్, వినయ్ తదితరులు నటించారు.
