అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Minister Seethakka | జిల్లాలో గ్రూప్ రాజకీయాలను పక్కనపెట్టి గుడ్ కార్యకర్తలుగా పేరు తెచ్చుకోవాలని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. నగర శివారులోని ఏవీఎం గార్డెన్లో (AVM Garden) నిర్వహించిన జహీరాబాద్ (Zaheerabad), నిజామాబాద్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. నిధులు, నియామకాలు అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ (BRS party).. నిధులన్నింటినీ కేసీఆర్ కుటుంబసభ్యులు తరలించుకుపోతే.. నీళ్లన్నీ ఫామ్‌హౌజ్‌లోకి తరలించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలేశ్వరగా మారిందన్నారు. కేసీఆర్ వరి వేస్తే రైతులకు ఉరి పడ్డట్టేనని ఎద్దేవా చేశాడని.. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన రైతులకు రూ. 500 అదనంగా ఇస్తోందన్నారు.
Minister Seethakka | 4న హైదరాబాద్‌లో మీటింగ్‌కు తరలిరావాలి
4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో (LB Stadium) జరిగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సక్సెస్ చేయాలని సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjuna Kharge) హాజరవుతున్నట్లు తెలిపారు. ఒక తల్లి బిడ్డలా మనమంతా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Minister Seethakka | సన్నబియ్యం ఇస్తున్నది మనమే..
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం పదేళ్లలో కేవలం 90 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని అందులో సగానికి పైగా బిల్లులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Illu) మంజూరు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇళ్లకు కరెంట్ ఇస్తోందని.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతికార్యకర్త కృషి చేయాలని సూచించారు.
Minister Seethakka | బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది..: షబ్బీర్‌అలీ
గత పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) విమర్శించారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా దేశంలో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, భూపతిరెడ్డి, మదన్మోహన్, లక్ష్మీ కాంతారావు, సంజయ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశవేణు, నేతలు వీరం బొజ్జ బండి రవి, నర్సింగ్ రావు, నరేష్ యాదవ్ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కైలాస్ శ్రీనివాస్, ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు