అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | వనమహోత్సవంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షించాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు (Vice Chancellor Yadagiri Rao) సూచించారు.
తెయూ ఎన్ఎస్ఎస్ (NSS) విభాగం యూనిట్–1,యూనిట్–2 ఆధ్వర్యంలో సైన్స్ కళాశాల ఆవరణలో వనమహోత్సవాన్ని (Vana Mahotsavam) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఆస్తి పర్యావరణాన్ని పరిరక్షించడమేనని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ యాదగిరి, ఇంజినీరింగ్ కళాశాల (Engineering College) ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, కామర్స్ డీన్ రాంబాబు, డైరెక్టర్ (పీఆర్వో) ఏ పున్నయ్య, యూజీసీ డైరెక్టర్ ఆంజనేయులు, నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్, మొహమ్మద్ అబ్దుల్ ఖవి, ప్రొఫెసర్ లావణ్య, ప్రసన్న రాణి, ప్రోగ్రాం ఆఫీసర్లు స్వప్న, స్రవంతితో పాటు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.