అక్షరటుడే, ఇందూరు: Nandev Maharaj | సంత్ శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) తెలిపారు. జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 700 ఏళ్ల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన బోధనలు నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తాయని అన్నారు. మేరు సమాజం ఆయన ఆలోచనల ప్రకారం ఐక్యంగా ముందుకు సాగి సామాజిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా మేరు సంఘం (Meru sangham Nizamabad) అధ్యక్షుడు హనుమంతరావు, కోశాధికారి చంద్రకాంత్ ప్రధాన కార్యదర్శి దేవదాస్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ నాందేవ్, నగర మేరు సంఘం ప్రతినిధులు దశరథ్ గంగాధర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాందేవ్ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, కొయ్యాడ శంకర్ తదితరులు