అక్షరటుడే, కోటగిరి: Kotagiri | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో (ZPTC and MPTC elections) గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశ కమిటీ సభ్యుడు, కోటగిరి మండల బీజేపీ ఇన్ఛార్జి కొండా ఆశన్న పేర్కొన్నారు. కోటగిరి బీజేపీ మండలాధ్యక్షుడు ఏముల నవీన్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో (Kotagiri Mandal Center) ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటగిరి మండలానికి స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులైన కొండ ఆశన్న మాట్లాడుతూ.. అక్టోబర్లో జరుగనున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పిల్లల మోహన్ రావు దేశాయ్, శ్యామల, మామిడి శ్రీనివాస్ రెడ్డి, రాజు, కొత్తపల్లి సాయి, వడ్ల శ్యాం, ఎల్లుట్ల గజేందర్, నాగరాజు, విలాస్ రావు, విఠల్, మోహన్, భాస్కర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.