అక్షరటుడే, బోధన్: Mla Sudarshan Reddy | పట్టణంలోని శక్కర్‌నగర్(Shakkarnagar) కాలనీలో రామాలయ (Ramalayam)అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి రూ. 10లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.