అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jajala Surender | సోమార్పేట్ (Somarpet) ఘటనలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని యశోద ఆస్పత్రి వైద్యులను కోరినట్లు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) పేర్కొన్నారు.
ఈ ఘటనలో గాయపడ్డ గంజి భారతి యశోద ఆస్పత్రిలో (Yashoda Hospital) చికిత్స పొందుతుండగా శనివారం పరామర్శించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడగా.. ఇప్పటికే భారతికి మూడు శస్త్రచికిత్సలు అయ్యాయని.. మెరుగైన చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు.
Jajala Surender | అధైర్యపడొద్దు.. నేనున్నా..
అనంతరం సోమార్పేట్ గ్రామస్థులతో ఆయన మాట్లాడుతూ.. తానున్నానని అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఘటనకు కారణమైన కాంగ్రెస్ నాయకులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టేది లేదని ఆయన పేర్కొన్నారు. అప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ బాధితులకు పూర్తి అండగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాగిరెడ్డిపేట్ జడ్పీటీజీ మాజీ సభ్యుడు మనోహర్ రెడ్డి తదితరులున్నారు.