Collector Nizamabad
Collector Nizamabad | ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. మోస్రా (Mosra) మండలం చింతకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Government High School), ప్రైమరీ స్కూల్, అంగన్​వాడీ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత స్థానాలకు చేరితే విస్తృత స్థాయిలో ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం, అదృష్టం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు, గౌరవం దక్కుతుందన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంటుందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయుడిని అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితమంతా హాయిగా ఉండొచ్చన్నారు.

తన విద్యార్థి దశలో ప్రస్థానాన్ని తెలియజేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. అంతకుముందు అంగన్​వాడీ కేంద్రంలో (Anganwadi Center) మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని గమనించి, వండిన ఆహార నాణ్యతను పరిశీలించారు. అలాగే ప్రైమరీ పాఠశాలలో బాలుర కోసం వెంటనే మూత్రశాల నిర్మాణం చేపట్టాలని, ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీవో శ్రీనివాసులు ఆదేశించారు.

అంగన్​వాడీ కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్​

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్​